రూ. 18వేల జీతం ఇవ్వాలి..మెదక్​ కలెక్టరేట్​ ఎదుట ఆశవర్కర్ల ధర్నా 

రూ. 18వేల జీతం ఇవ్వాలి..మెదక్​ కలెక్టరేట్​ ఎదుట ఆశవర్కర్ల ధర్నా 

మెదక్​ టౌన్​, వెలుగు:  ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్​చేస్తూ మెదక్​ కలెక్టరేట్​ఎదుట సీఐటీయూ యూనియన్​ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.  సంఘం జిల్లా గౌరవ ప్రెసిడెంట్​నర్సమ్మ మాట్లాడుతూ.. ఆశ  వర్కర్లకుకు బడ్జెట్​లో తగిన నిధులు కేటాయించాలని, ఉన్నతాధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్​ చేశారు.

కలెక్టరేట్​లోని వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో గేటు బయటే రెండు గంటల పాటు ధర్నా చేశారు. అడిషనల్​కలెక్టర్​నగేశ్ కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆశావర్కర్లు అందజేశారు. సంఘం జిల్లా నాయకురాలు రాణి, పెంటమ్మ, దుర్గ, గీత, లక్ష్మి, ప్రభావతి, సుశీల, సీఐటీయూ జిల్లా నేత సంతోష్ పాల్గొన్నారు.